తిరువనంతపురం: కేరళ మాజీ శాసనసభ్యుడు పి.టి. థామస్ మరణంతో కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని త్రిక్కకర స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం జరిగాయి. ఆయన వితంతు భార్య ఉమా థామస్ తన సమీప ప్రత్యర్థి డాక్టర్ జో జోసఫ్ (సిపిఐ-ఎం)ను 22000 ఓట్ల మార్జిన్‌తో ఓడించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని తిరిగా దక్కించుకుంది. ఓట్ల లెక్కింపు మొదలు నుంచే ఆమె లీడింగ్ కొనసాగించారు. త్రిక్కకర అసెంబ్లీ స్థానాన్ని పి. టి. థామస్ 2016 నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణంతో ఇప్పుడు ఆయన వితంతు భార్య ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు.
ఉప ఎన్నికలో గెలుపొందాలని అధికార ఎల్‌డిఎఫ్ బాగానే ప్రయత్నించినప్పటికీ దాని ఆశలు నీరుగారాయి. ప్రస్తుతం కేరళ అసెంబ్లీలోని 140 స్థానాల్లో దానికి 100 సీట్లున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఇంటింటికి తిరిగా ప్రచారం చేసినప్పటికీ ఆ స్థానాన్ని గెలుచుకోలేకపోయారు. త్రిక్కకర నియోజకవర్గం కాంగ్రెస్‌కు మంచి పట్టున్న స్థానం. ఈ విజయం కాంగ్రెస్‌కు మంచి ఊపును ఇవ్వగలదని భావిస్తున్నారు.