Saturday, November 23, 2024

కేరళలో కొత్తగా 5080 కోవిడ్-19 కేసులు

- Advertisement -
- Advertisement -
196 మంది మృతి

తిరువనంతపురం: కేరళలో ఆదివారం కొవిడ్-19 కొత్త కేసులు 5080 నమోదయ్యాయి. 196 మంది ఆ వైరస్‌తో మృతి చెందారు. దీంతో కేరళలో కోవిడ్ కేసుల మొత్తం సంఖ్య 5089175కు చేరుకోగా, మృతుల సంఖ్య 37495కుచేరుకుంది. ఇక శనివారం 7908 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్యయ 50లక్షలు దాటి 50,04,786కు చేరుకుంది. కాగా యాక్టివ్ కేసులు 58,088కి తగ్గాయని అధికారిక ప్రకటన పేర్కొంది. 24 గంటల్లో దాదాపు 53892 శాంపిల్స్ పరీక్షించారు. 14 జిల్లాల్లో ఎర్నాకుళంలో అత్యధికంగా 873 కేసులు, ఆ తర్వాత స్థానంలో కోజికోడ్ 740 కేసులు, తిరువనంతపురం 621 కేసులతో ఉన్నాయి. కొత్తగా గుర్తించిన కేసుల్లో 24 మంది హెల్త్ వర్కర్లు కాగా, 28 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు, 4776 మందికి కాంటాక్ట్‌ల ద్వారా సంక్రమించింది. కాగా 252 మంది వివరాలు స్పష్టంగా తెలియలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News