Wednesday, January 22, 2025

అమెరికా నుంచే కేరళలో పాలన : కేరళ సిఎం వెల్లడి

- Advertisement -
- Advertisement -

Kerala CM leaves to US for medical treatment

తిరువనంతపురం : చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొంతకాలం అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని వెల్లడించారు. మరెవరికీ పాలనాభాధ్యతలు అప్పగించబోనని స్పష్టం చేశారు. అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటానని తెలిపారు. చికిత్స కోసం తన భార్య వ్యక్తిగత సిబ్బందితో కలిసి విజయన్ అమెరికా వెళ్లారు. జనవరి 29న తిరిగి రానున్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానికి కూడా సీఎం వర్చువల్ పద్ధతి లోనే హాజరయ్యారు. కాగా జనవరి 19 న మరో కేబినెట్ భేటీ ఉంటుందని, ఈ సందర్బంగా తెలిపారు. ఆస్పత్రి బెడ్‌పై నుంచీ పనిచేస్తానని ఈ మేరకు సూచన ప్రాయంగా వెల్లడించారు. పినరయి విజయన్ 2018 లో వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు ఈపీ జయరాజన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈసారి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులైన ఎంవీ గోవిందన్, కె. రాధాకృష్ణన్‌కు బాధ్యతలు అప్పగిస్తారని అంతా భావించారు. అయితే కేబినెట్ భేటీ ప్రకటనతో ఈ ఊహాగానాలకు సీఎం తెరదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News