Monday, January 20, 2025

29న ఖమ్మం రానున్న కేరళ ముఖ్యమంత్రి..

- Advertisement -
- Advertisement -

వేంసూరు: ఈ నెల 29 నుండి 31 వరకు ఖమ్మం నగరంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా 29న జరిగే ప్రారంభ బహిరంగ సభకు, పజా ప్రదర్శనకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ రానున్నారని ప్రజలందరు పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్ రావులు ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆదివారం ఆటో ప్రచార జాతాను మండల పరిధిలోని పల్లెవాడ గ్రామం నుండి ప్రారంభించారు. సిపిఎం మండల కమిటి సభ్యులు కావూరి సుదర్శన్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో పాల్గొన్న నేతలు మల్లూరు, అర్వపల్లి లు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టంకు నిధులు కేటాయించడం లేదని, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతుందని, మతోన్మాదాన్ని సౄష్టిస్తుందని పేదలను వేరు చేసి ప్రజా ధనాన్ని కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని ఐక్య పోరాటాలు చేయాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News