Sunday, December 22, 2024

వ్యక్తికి 80 ఏళ్లు జైలు శిక్ష..

- Advertisement -
- Advertisement -

ఇదుక్కి : కేరళలో ఓ కోర్టు ఓ కాముకుడికి చేసిన నేరానికి గాను అంతా కలిపి మొత్తం 80 సంవత్సరాల కారాగార శిక్షను విధించింది. ఈ వ్యక్తి 2020 సంవత్సరంలో తన భార్యకు సమీప బంధువు అయిన 14 ఏండ్ల బాలికపై అత్యాచారాలకు పాల్పడుతూ వచ్చి, ఆమె గర్భానికి కారకుడు అయ్యాడు. మూడేళ్ల తరువాత ఇదుక్కి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి టిజి వర్గీస్ ఈ వ్యక్తికి శిక్షను ప్రకటించారు. పోస్కో చట్టం పరిధిలో ఈ వ్యక్తికి మొత్తంమీద దాదాపుగా నాలుగు జీవితఖైదు శిక్షలను విధించారు. దోషికి రూ 40,000 జరిమానా కూడా విధించారు. బాధితురాలి పునరావాసానికి రూ లక్ష పరిహారం చెల్లించాలని న్యాయస్థానం జిల్లా లీగల్ సర్వీసెస్ అథార్టీని ఆదేశించింది. బాలికపై దారుణానికి పాల్పడ్డ వ్యక్తి భార్య ఇంట్లో లేని రెండు మూడు నెలల వ్యవధిలో బాలికను తమ కామం తీర్చుకునేందుకు వాడుకున్నట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News