- Advertisement -
తమిళనాడు సిఎం స్టాలిన్ రూ. 5 కోట్ల సాయం
చెన్నై: కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డంతో తాజాగా మృతుల సంఖ్య 63కు పెరిగింది. దాదాపు 116 మంది గాయపడ్డారు. వాయనాడ్ కేరళ లోని కొండ ప్రాంతం. ఇప్పటికీ చాలా మంది శిథిలాల క్రింద ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇదిలావుండగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ సిఎం జనరల్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5 కోట్లను కేరళకు కేటాయించారు. అంతేకాకుండా కేరళకు తమిళనాడు నుంచి విపత్తు దళాలలను, డాక్టర్లను, నర్సులను, ఇద్దరు ఐఏఎస్ అధికారులను రెస్య్కూ టీమ్ గా పంపారు. కేరళకు కావలసిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలావుండగా 200 మంది భారతీయ సైనిక సిబ్బంది, 30 మంది నావీ ఈతగాళ్లు కూడా కేరళకు చేరారు. వారంతా రెస్క్యూ కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.
- Advertisement -