Monday, December 23, 2024

వయనాడ్ లో భీభత్సం…50 మంది మృతి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున భారీ కొండచరియలు విరిగిపడ్డియి. మట్టి దిబ్బల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 మందికి పైగా చనిపోయారని వార్త. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు రంగంలోకి దిగాయి. అదనపు బృందాలను కూడా సమీప ప్రాంతాల నుంచి రప్పిస్తున్నారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు సహాయకచర్యలకు అంతరాయం కలిగిస్తున్నాయి.  మెప్పాడి, ముండకై ప్రాంతాల్లో విధ్వంసం తీవ్రంగా ఉంది. వెల్లర్మల పాఠశాల అయితే పూర్తిగా మునిగిపోయింది. సహాయక చర్యలకు హెలికాప్టర్ ను కూడా ఉపయోగిస్తున్నారు.  వంతెన కూలడంతో అత్తమల, చురల్ మలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Kerala 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News