Sunday, March 9, 2025

ఎస్‌ఎల్‌బిసి ఘటనలో పురోగతి.. మనుషుల ఆనవాళ్లు గుర్తింపు!

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి)లో పైకప్పు కూలి చిక్కుకుపోయిన ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసింది. కొద్ది రోజులుగా సహాయక చర్యల్లో జాగిలాలను ఉపయోగిస్తున్నారు. తాజాగా గల్లంతైన వారిని గుర్తించడంలో పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్ వద్ద మనుషుల ఆనవాళ్లను కేరళకు చెందిన జాగిలాలు గుర్తించాయి. దీంతో ఆ ప్రాంతంలో జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. దీంతో కొందరి ఆచూకీ ఆదివారం సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News