Monday, December 23, 2024

బైక్ ను ఢీకొట్టిన కేరళ ఎక్స్‌ప్రెస్‌…. తప్పిన పెనుప్రమాదం

- Advertisement -
- Advertisement -

రఘునాథపాలెం: ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో కేరళ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కేరళ ఎక్స్‌ప్రెస్ తిరువనంత పురం నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పాపటపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ రైల్వే స్టేషన్ చివరలో వృద్ధుల కోసం నిర్మించిన చప్టా మీదుగా సోమవారం ఓ వ్యక్తి తన బైక్‌పై ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కేరళ ఎక్స్‌ప్రెస్ రావడంతో బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. బైక్‌కు ట్రైన్ ఢీకొట్టి 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. వెంటనే లోకోపైలెట్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయని, బైక్ కవర్‌లో ఉన్న సెల్‌ఫోన్ కూడా పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు వివరించారు. బైక్ నంబర్ ఆధారంగా ధరావత్ వీరన్నదిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News