తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై కేరళ గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ ఆరోపణలు చేశారు. పినరయి విజయన్ బంగారం స్మగ్లింగ్, దేశ వ్యతిరేక కార్యకలాపాల విషయంలో తనను అంధకారంలో ఉంచారన్నారు. ‘‘ఒకవేళ దేశ భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించే విషయాలు నా దృష్టికి వస్తే ఆ విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేయడం నా విధి. ముఖ్యమంత్రే సమాచారంకు మూలమైనప్పుడు, నన్ను అంధకారంలో ఉంచినప్పుడు ఏమి చేయాలి? జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరగలేదని ఆయన ఇప్పుడు అంటున్నారు’’ అని గవర్నర్ మీడియాకు వివరించారు.
‘‘జాతి వ్యతిరేక కార్యకలాపాలు, రాష్ట్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి తానేమి అనలేదని ఆయన అంటున్నారు. ఆయన అన్న విషయాన్ని నేను విశ్వసిస్తాను. కానీ తర్వాత ఆయనే దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని అన్నారు. అది కూడా పన్ను ఎగవేతలో ఓ భాగం. ఆయన విలేకరుల సమావేశంలో తనన్నది జనరల్ స్టేట్ మెంట్ అన్నారు. కానీ బంగారం స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలే’’ అని కేరళ గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ వివరించారు.