Monday, December 23, 2024

కేరళ గవర్నర్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్

- Advertisement -
- Advertisement -

Kerala Governor Facebook hacked

తిరువనంతపురం: గవర్నర్ ఆరిఫ్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి తమకు సమాచారం పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం నుంచి తన ఫేస్‌బుక్ ఖాతాను హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకున్నారని ఆరిఫ్ మొహమ్మద్ ట్వీట్ చేశారు. తన ఖాతాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్వీట్‌లో గవర్నర్ పేర్కొన్నారు. అయితే ఖాతా హ్యాక్ అయిందని పోలీసులు, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌కు సమాచారమిచ్చి గంటల గడిచినా గవర్నర్ ఖాన్ ఖాతాలోని పోస్టులు ఇంకా తొలగించకపోవడం గమనార్హం. కాగా గవర్నర్ ఖాతాలో మూడు అనధికార పోస్టులు ఉన్నాయి. హార్డ్‌వేర్, నిర్మాణరంగ సంబంధిత వీడియోలు పోస్టు అయ్యాయి. వీడియోల వివరణ ఉంది. గవర్నర్ పునరుద్ధరించడానికి పడుతుందని వర్గాలు తెలిపాయి.

Kerala Governor Facebook hacked

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News