Thursday, January 23, 2025

బిల్లుల పెండింగ్‌పై గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కేరళ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండడంపై గవర్నర్ ఆరిఫ్‌మహమ్మద్ ఖాన్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను సకాలంలో క్లియర్ చేసేలా గవర్నర్ ఆరిఫ్‌ను ఆదేశించాలని కోరింది. ఈమేరకు గురువారం పిటిషన్ దాఖలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన ఎనిమిది బిల్లుల్లో మూడు బిల్లులు రెండేళ్లకు పైగా , మరో మూడు బిల్లులు ఏడాదికిపైగా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని కేరళ ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లులపై గవర్నర్ నిష్క్రియాత్మక చర్య ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ బాధ్యత నుంచి తప్పుకోవడంతో సమానమని కేరళ ప్రభుత్వం వాదించింది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్‌ను యూనివర్శిటీల ఛాన్సలర్ నుంచి ప్రభుత్వం తొలగించిన బిల్లు కూడా ఈ పెండింగ్ జాబితాలో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News