Friday, December 20, 2024

పాఠ్యపుస్తకాలలో మహాత్ముని హత్యపై తొలగించిన అధ్యాయాలు చేర్చిన కేరళ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: మహాత్మా గాంధీ హత్య, 2022 నాటి గుజరాత్ అల్లర్లు, ఎమర్జెన్సీ కాలానికి సంబంధించి 11, 12వ తరగతి సిలబస్ నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్(ఎన్‌సిఇఆర్‌టి) తొలగించిన అధ్యాయాలను అనుబంధ పాఠ్యపుస్తకాలుగా కొత్తగా ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.

ఆగస్టు 23న ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇక్కడి కాటన్ హిల్ స్కూలులో జరిగే ఒక కార్యక్రమంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి గురువారం వెల్లడించారు. 11, 12వ తరగతులకు చెందిన సిలబస్ నుంచి ఎన్‌సిఆర్‌టి తొలగించిన ఈ అధ్యాయాలను తిరిగి చేర్చాలని కేరళ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది.

ఎన్‌సిఇఆర్‌టి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల నుంచి అనేక అధ్యాయాల తొలగింపు జరిగింది. కొవిడ్ కారణంగా విద్యార్థులపై పాఠ్యపుస్తకాల భారం తగ్గించడానికి ఈ పని చేపట్టినట్లు ఎన్‌సిఇఆర్‌టి గతంలో ప్రకటించింది. అయితే ఈ తొలగింపు అసలు ఉద్దేశం విద్యార్థులపై సిలబస్ భారం కాకుండా కొన్ని స్వార్థశక్తుల ప్రయోజనాలు కాపాడడమే అని ఎవరికైనా సులభంగా అర్థమవుతుందని శివన్‌కుట్టి వ్యాఖ్యానించారు. జాతీయ ప్రయోష్టిద్యాపరమైన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను కేరళ రూపొందిస్తుందని, 6వ తరతగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలలో ఎన్‌సిఇఆర్‌టి చేసిన మార్పులు కేరళపై పెద్దగా ప్రభావం చూపబోవని ఆయన అన్నారు. అయితే 11, 12వ తరగతి పాఠ్యపుస్తకాలు మాత్రం కేరళకు ఉపయోగపడతాయని, అందుకే తొలగించిన అధ్యాయాలను తిరిగి చేర్చాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.

రాజ్యాంగ మౌలిక సూత్రాలను, దేశ చరిత్రను, దేశం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను మరుగున పరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రాజకీయ దురుద్దేశాలతోనే ఈ పాఠ్యాంశాలను తొలగించడం జరిగిందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News