Wednesday, January 22, 2025

నగ్నత్వం అశ్లీలం అంటే కుదరదు: కేరళ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

కొచ్చి: నగ్నత్వాన్ని అసభ్యత అశ్లీలంతో ముడిపెట్టడం అనుచితమే అవుతుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. మహిళల శరీరాకృతి మేరకు వారు తమ అందాలను చాటుకోవడం అనేది వారి శరీరాలపై వారికి వ్యక్తిగతంగా ఉండే హక్కు పరిధిలోకి వస్తుంది, నగ్నప్రదర్శన లేదా అర్థనగ్న దుస్తులు ధరించారని వారిని వేధించడం కేవలం వారి హక్కును హరించివేయడమే అవుతుందని హైకోర్టు తెలిపింది. స్థానిక మహిళా హక్కుల ఉద్యమకర్త రెహనా ఫాతిమా కేసును కొట్టివేసిన దశలో జస్టిస్ కౌసర్ ఎడప్పగథ్ తమ తీర్పులో వినూత్న కీలక అంశాలను వెలువరించారు.

33 ఏండ్ల ఫాతిమా ఓ దశలో తన అర్థనగ్న శరీరంపై తన పిల్లలు బొమ్మలు వేయడానికి వీలుగా ఉండటం, సంబంధిత వీడియో వెలుగులోకి రావడంతో పోస్కో, జువెనైల్, ఐటి చట్టాల పరిధిలో పలు కేసులు దాఖలు అయ్యాయి. అయితే ఆమె చేసిన పనిలో ఎటువంటి తప్పిదం లేదని న్యాయమూర్తి తెలిపారు. పిల్లల పట్ల ఆమె లైంగిక దృక్పథంతో వ్యవహరించలేదు. వారిని వేధించలేదు. తన శరీరాన్ని కేవలం వారు కాన్వాసుగా వాడుకోవడానికి నిలుచున్నారని, ఇందులో తప్పేమీ లేదని పేర్కొన్నారు. మహిళ తన శరీరం ప్రదర్శనకు సంబంధించి ఇష్టానుసారంగా ఉండటం ప్రాధమిక హక్కు పరిధిలోకి వస్తుంది.

ఇది సమానత, గోప్యతల అంశం, ఆమె ఎవరైనా తన శరీరాన్ని తాను ఎంచుకున్న విధంగా ప్రదర్శనకు దిగడం అనుచితం ఏమీ కాదని వ్యక్తుల స్వేచ్ఛకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు పరిధిలో దీనిని చూడాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఆడవారి పై భాగం అంటే వక్షోజాల భాగం ఆఛ్చాదన లేకుండా ఉండరాదనే భావన ఉందని, ఈ తరహాలో లైంగిక చర్యలను రెచ్చగొట్టినట్లు అవుతుందని చెపుతూ ఉంటారని, మరి మగవారి పై భాగాల నగ్నత్వం విషయంలో ఇటువంటి చిత్రణ ఉండదని ఇదెక్కడి న్యాయం అని ఈ మహిళ కోర్టుకు తెలియచేసుకుంది. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. సొంత పిల్లలు తమ కళను చాటేందుకు తల్లి శరీరాన్ని వాడుకోవడం కేవలం కళాత్మకత విషయాల పరిధికి వస్తుంది. దీని వెనుక లైంగిక ప్రోద్బల చర్యలు ఆపాదించడం కేవలం దురుద్ధేశపూరితం అవుతుందని కోర్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News