Sunday, December 22, 2024

ఆ ముగ్గురినీ ఈ నెల 5 వరకు అరెస్టు చేయొద్దు

- Advertisement -
- Advertisement -

కోచ్చి: తెలంగాణలో టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కుట్ర కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తితో కలిసి పని చేస్తున్న ముగ్గురికి కేరళ హైకోర్టు శుక్రవారం అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించింది. కోచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న ఈ ముగ్గురు జగ్గు స్వామి అనే వ్యక్తితో తాము సన్నిహితంగా ఉన్నందున తెలంగాణ పోలీసులు తమను అరెస్టు చేసే అవకాశముందంటూ ముందస్తు బెయిలుకోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ ముగ్గురినీ పోలీసులు ఇప్పటివరకు నిందితులుగా పేర్కొనలేదని అభిప్రాయపడింది.

అయినప్పటికీ ఈ నెల 5న ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునేంత వరకు వీరిని అరెస్టు చేయవద్దంటూ తాత్కాలిక రక్షణ మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని తన ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని కోరుతూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్) నోటీసులు జారీ చేయడంతో ఈ ముగ్గురు కోర్టును ఆశ్రయించారు. తెలంగాణలోని రాజకీయ కుట్రలో తమకు ఏ విధమైన సంబంధం లేదని ఈ ముగ్గురు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. నలుగురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు యత్నం కేసులో బిజెపి సీనియర్ నేత బిఎల్ సంతోష్, కేరళకు చెందిన జగ్గూ స్వామి, తుషార్ వెల్లపల్లి, బి శ్రీనివాస్‌లు సిట్ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News