Monday, December 23, 2024

ముగ్గురి హత్య కేసులో దోషికి కేరళ హైకోర్టు మరణ శిక్ష

- Advertisement -
- Advertisement -

కొచి ( కేరళ ): ముగ్గురిని హత్య చేసిన హంతకునికి కేరళ హైకోర్టు బుధవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడు తన పెద్ద సోదరుడిని, అతని 33 ఏళ్ల కుమార్తెను, కోడలిని దారుణంగా హత్య చేసినట్టు నేరం రుజువు కావడంతో అదనపు జిల్లా కోర్టు ( మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, లైంగిక హింస) కేసుల )మరణ శిక్ష విధించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిందు పిఎ విలేఖరులకు బుధవారం వెల్లడించారు. పదునైన ఆయుధంతో మహిళను 33 సార్లు పొడిచి చంపడమైందని ఇది అత్యంత క్రూరమైన నేరంగా పేర్కొన్నారు.

పెద్ద సోదరుడిని, కోడలిని హత్య చేసినందుకు ఒక్కో హత్యకు సంబంధించి జీవితకాల కారాగార శిక్ష విధించినట్టు తెలియజేశారు.ఇది కాక హత్యాయత్నం, ఇంటిని అక్రమంగా ఆక్రమించడం, తీవ్రంగా గాయపర్చడం తదితర వివిధ నేరాల కింద నిందితునికి 46 ఏళ్ల శిక్షతోపాటు రూ. 4.16 లక్షల జరిమానా కోర్టు విధించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు. నిందితుడు మొదట వివిధ నేరాల కింద విధించిన శిక్షను అనుభవించిన తరువాత, జీవిత కారాగార శిక్ష అనుభవించవలసి ఉంటుందని కోర్టు తీర్పులో వివరించింది.

మరణ శిక్షను కేరళ హైకోర్టు నిర్ధారించవలసి ఉంటుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఈ నేరాలు ఆస్తి వివాదంతో 2018లో జరిగాయి. నిందితుడు 33 ఏళ్ల బాధితుని మైనర్ కుమారుడిని చంపడానికి ప్రయత్నించడంతో ఈ కేసు అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ముందుకు విచారణకు వచ్చిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News