Thursday, December 12, 2024

స్త్రీలకే కాదు.. పురుషులకూ గౌరవ మర్యాదలుంటాయి : కేరళ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ఓ నటితో అసభ్యంగా ప్రవర్తించారన్న అభియోగాలపై నమోదైన కేసుకు సంబంధించి సీనియర్ నటుడు , దర్శకుడు బాలచంద్ర మేనన్ కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులోఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకే కాదు, పురుషులకూ గౌరవ మర్యాదలుంటాయని పేర్కొంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలుగు లోకి వచ్చిన అనంతరం , గతంలో తామూ వేధింపులు ఎదుర్కొన్నామంటూ అనేక మంది నటీమణలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2007 లో ఓ సినిమా షూటింగ్‌లో దర్శకుడు బాలచంద్ర మేనన్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఓ నటి ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీ లోని పలు సెక్షన్‌ల కింద ఆయనపై కేసు నమోదైంది.

2007 లో జరిగిన సంఘటనకు సంబంధించి 17 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేశారని, కేవలం తన ప్రతిష్ఠను దెబ్బతీయడమే వారి ఉద్దేశమని పేర్కొంటూ మేనన్ హైకోర్టులో పిటి దా ఖలు చేశారు. విచారించిన జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ , నటుడి వాదనలో బలం ఉందన్నారు. 40 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన రెండు జాతీయ అవార్డులు అందుకోవడంతోపాటు ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించిందన్నారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోందని, అయితే న్యాయ ప్రయోజనాల దృష్టా పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు కేసుకు సంబంధించి విచారణ అధికారి ముందు హాజరు కావాలని మేనన్‌ను ఆదేశించారు. దర్యాప్తు తరువాత మేనన్‌ను అరెస్టు చేయాలని దర్యాప్తు అధికారి ప్రతిపాదిస్తే రూ. 50 వేల బాండు, ఇద్దరు పూచీకత్తుతో అతనిని విడుదల చేయాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News