Saturday, January 18, 2025

భార్య చేతి వేళ్లను నరికి…

- Advertisement -
- Advertisement -

husband who cut his wife's throat with knifeమన తెలంగాణ/ ఇట్టుమనూర్ న్యూస్: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య చేతి వేళ్లను భర్త నరికిన సంఘటన కేరళ రాష్ట్రం ఇట్టుమనూర్ ప్రాంతం కనక్కరీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రదీప్ కుమార్-మంజు అనే దంపతులు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తున్నారు. ప్రదీప్ కుమార్ మద్యానికి బానిస కావడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం పెద్ద అమ్మాయి స్కూల్‌కు వెళ్లింది. చిన్న అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ప్రదీప్ కత్తి తీసుకొని భార్య చేతి వేళ్లను నరికాడు. అనంతరం ముక్కు, పెదాలు, ఎడమ చెంపపై కత్తితో దాడి చేశాడు. చిన్న కూతురు ఇంట్లో ఉండగానే ఈ దాడి జరిగింది. ఇంట్లో నుంచి అరుపులు కేకలు రావడంతో అతడు వెంటనే ఇంట్లో నుంచి ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న పోలీసులు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని పట్టుకున్నారు. అతడు మద్యానికి బానిస కావడంతోనే ఇది జరిగిందని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి…

పెంచుకున్నందుకు పీక కోశాడు….

ఒంగోలులో బైక్ తో ఢీకొట్టి…. మహిళపై అత్యాచారం…

ప్రేమోన్మాదానికి కూతురు, తండ్రి బలి

యువతిని రైలు కింద తోసేసి…

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News