తిరువనంతపురం: కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ భర్తను భార్య హత్య చేసిన సంఘటన కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా కంచియార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కంచియార్ ప్రాంతంలో బిజేష్ బెన్నీ(29), అనుమూల్(27) దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల పాప ఉంది. అనుమూల్ నర్సరీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవ జరగడంతో అనుమూల్ తన భర్తపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. మద్యం మత్తులో బిజెష్ తన ఇంటికి వచ్చి భార్యతో గొడవ దిగాడు.
గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను చంపేసి బ్లాంకెట్ చుట్టి మంచ కింద మృతదేహాన్ని దాచిపెట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకొని తన భార్య కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు విచారణ ప్రారంభించారు. ఆమె ఆచూకీ ఎక్కడ కనిపించకపోవడంతో ఇంట్లో సోదాలు నిర్వహించగా బెడ్ కింద ఆమె మృతదేహం కనిపించింది. పోలీసులు కళ్లుకప్పి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు కుమాలీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించారు. తమిళనాడు స్టైల్‌లో పంచె కట్టుకొని కేరళ నుంచి తమిళనాడు సరిహద్దులోనికి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. రోసాపూకుండమ్ ప్రాంతంలో బిజేష్‌ను అరెస్టు చేశామని పోలీస్ అధికారి జాబిల్ అంటోనీ తెలిపాడు.