Thursday, January 23, 2025

గొంతులో ఇరుక్కున్న తల్లి పాలు.. పసికందు మృతి… కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

తిరువనంతపురం: తల్లి పాలు గొంతులో ఇరుక్కొని పసికందు చనిపోవడంతో మనస్తాపానికి గురై తన కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున సంఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉప్పుతర ప్రాంతంలో లిజా టామ్ (38) అనే మహిళ తన కుమారుడు, భర్తతో కలిసి ఉంటుంది. లిజా టామ్ నిండు గర్భణి కావడంతో 28 రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రతీ రోజు లాగే నవ జాత శిశువు పాలు ఇచ్చింది. పాలు గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక పసికందు ప్రాణాలు కోల్పోయింది. దీంతో పాప చనిపోవడంతో తల్లి తట్టుకోలేకపోయింది. కుటుంబ సభ్యులు చర్చి వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో లిజా తన కుమారుడు(7)తో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News