Monday, December 23, 2024

మంకీపాక్స్ పై హెచ్చరిక జారీ చేసిన కేరళ

- Advertisement -
- Advertisement -

 

MonkeyPox

తిరువనంతపురం:  కేరళలో భారతదేశంలో మొట్టమొదటి మంకీపాక్స్ కేసు నమోదైన ఒక రోజు తర్వాత, రాష్ట్ర ఆరోగ్య శాఖ మొత్తం 14 జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. మంకీపాక్స్ కేసు నమోదవుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాలను అప్రమత్తం చేశామని ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం తెలిపారు. “ఐదు జిల్లాల ప్రజలు- తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా , కొట్టాయం- యుఎఇ నుండి సోకిన వ్యక్తితో పాటు ప్రయాణించారు. దీంతో ఆయా జిల్లాల్లో ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. వారి ఆరోగ్య స్థితి గురించి అప్‌డేట్‌లను పొందడానికి ఆరోగ్య కార్యకర్తలు ఈ వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నారు. అవసరమైతే మంకీపాక్స్ కు సంబంధించిన పరీక్షలు చేస్తారు. అన్ని జిల్లాల్లో ఐసోలేషన్ యూనిట్లు సిద్ధం చేశారు. అయితే, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు’’ అని మంత్రి చెప్పారు.

ధృవీకరించబడిన కేసులో… కొల్లంకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జార్జ్ తెలిపారు. అతని కాంటాక్ట్స్ లో  పదకొండు మందిని హై-రిస్క్ కేటగిరీలో ఉంచినట్లు ఆమె తెలిపారు.  షార్జా నుండి తిరువనంతపురం మంగళవారం (జిఇ 1402) వెళ్లిన ఇండిగో విమానంలోని మొత్తం 164 మంది ప్రయాణికులు, ఆరుగురు క్యాబిన్ సిబ్బందికి తమకు లక్షణాలు ఉన్నాయేమో చూసుకోవాలని, ఒకవేళ ఏవేని లక్షణాలు ఉంటే  21 రోజుల్లోపు ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రయాణికులందరినీ గుర్తించేందుకు పోలీసుల సహాయం కూడా కోరినట్లు ఆమె తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News