Thursday, January 23, 2025

భార్యపై కిరోసిన్ పోసి తగలబెట్టి.. గొంతు కోసుకొని బావిలో దూకిన భర్త

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టి అనంతరం భర్త గొంతుకోసుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేరళలోని కొల్లమ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రహీమ్-నదిరా అనే దంపతులు మధ్య గొడవలు జరగడంతో వేర్వేరుగా ఉంటున్నారు. పారిపల్లిలోని అక్షయ సెంటర్‌లో నదిరా పని చేస్తుండగా భర్త అక్కడికి వచ్చి ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. అక్కడి నుంచి బయటకు పరుగులు తీస్తూ రహీమ్ గొంతు కోసుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించినప్పటికి చికిత్స పొందుతూ చనిపోయింది.

గతంలో భార్యపై దాడి చేసిన కేసులో జైలు జీవితం గడిపి నాలుగు రోజుల క్రితం భర్త జైలు నుంచి విడుదలయ్యారు. పల్లికల్ పోలీస్ స్టేషన్‌లో రహీమ్‌పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. గతంలో భార్యను చంపుతానని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Also Read: మాస్కు లేకుండా దగ్గినందుకు రెండేళ్ల జైలు శిక్ష

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News