Monday, December 23, 2024

అతడికే చికిత్స అందిస్తుండగా వైద్యురాలిని పొడిచి చంపిన ఉపాధ్యాయుడు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: గాయపడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చికిత్స అందిస్తుండగా అతడు వైద్యురాలిని కత్తితో పొడిచి చంపిన సంఘటన కేరళలోని కొల్లాం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సందీప్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిస కావడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో వాళ్లతో గొడవపడి తనని కాపాడాలని పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వెళ్లేసరికి అతడి కాలుకు గాయం కావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్ వందన దాస్‌ (23) దగ్గరికి సందీప్‌ను పోలీసులు తీసుకెళ్లారు. వైద్యురాలు అతడికి చికిత్స చేస్తుండగా పోలీసులు గది బయట ఉన్నారు.

మద్యం మత్తులో ఉన్న సందీప్ కత్తి తీసుకొని ఆమెను చంపేస్తానంటూ కేకలు వేశాడు. వెంటనే ఆమెను పలుమార్లు పొడిచాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా కత్తితో దాడి చేశాడు. సందీప్‌ను పోలీసులు బందించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వెంటనే రక్తపు మడుగులో ఉన్న వైద్యురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వైద్యురాలు మృతి చెందింది. దీంతో కేరళ వ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు. వైద్యురాలి మర్డర్‌పై కేరళ హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఎందుకు అంతా ఉదాసీనతగా ప్రవర్తించారని మందలించింది. రక్షించడంలో పోలీసులు విఫలమైనప్పుడు వారి అవసరం ఎందుకు అని ఎదురు ప్రశ్నించింది. విద్యాశాఖ అధికారులు సందీప్‌ను సస్సెండ్ చేశారు.  ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చికిత్స చేస్తున్న వైద్యురాలిపై దాడి చేసి చంపడమనేది బాధకరమైన విషయమన్నారు. చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులపై దాడి చేస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు.

Also Read: ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్‌దే హవా..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News