Thursday, January 23, 2025

ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి అనంతరం కనతండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలోని పాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామాపురంలో జోమెన్(40) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. భార్య అతడిని వదిలిపెట్టి వెళ్లడంతో ముగ్గురు కుమార్తెలు అనన్య(13), అమేయ(10), అనామిక(7)తో కలిసి ఉంటున్నాడు. సోమవారం అర్థరాత్రి సోమయంలో ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి అనంతరం అదే ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. గ్రామస్థులు గమనించి ముగ్గురు కూతుళ్లను ఆస్పత్రికి తరలించారు. చిన్నకూతురు అనామికి పరిస్థితి విషమంగా ఉందని మిగిలిన ఇద్దరు కూతుళ్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

Also Read: దొంగలకే దొంగ ఆ పోలీసు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News