Thursday, January 23, 2025

యువతిని కత్తితో పొడిచిన మాజీ ప్రియుడు….

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: మాజీ ప్రియుడు యువతిని కత్తి పొడిచిన సంఘటన కేరళలోని కోఝికోడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అర్షద్ అనే యువకుడు ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కొన్ని రోజులు గాఢంగా ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఎంగేజ్‌మెంట్ చేశారు. దీంతో అప్పటి నుంచి అర్షద్‌ను ఆమె దూరం పెట్టింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో పాటు నంబర్‌ను బ్లాక్‌లో పెట్టింది. అర్షద్ మరో యువకుడు అఫ్సల్‌తో కలిసి ఆమెపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అర్షద్ కూడా ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డారు. అక్కడ ఉన్న సిసి కెమెరాలో వీడియో రికార్డు అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: నేడు వాహనమిత్ర నిధులు విడుదల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News