- Advertisement -
త్రివేండ్రం: కేరళలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3.00 వరకు 52.25 శాతంగా నమోదయింది. కేరళలో మొత్తం 2.77 కోట్ల మంది ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం 3.00 వరకు సగం మందే ఓటేశారు. పొన్నాని నియోజకవర్గం తప్పించి అన్ని నియోజకవర్గాల్లో 50 శాతంకు పైగా పోలింగ్ జరిగింది. నియోజకవర్గాల ప్రకారం తిరువనంతపురం 50.49, అత్తింగల్ 53.21, కొల్లం 50.85, పథనంథిట్ట 50.21, మవెలిక్కర 50.82, అళపుళ 54.78, కొట్టాయం 51.16, ఇడుక్కి 50.92, ఎర్నాకులం 51.24, చలకుడి 54.41, త్రిస్సూర్ 53.40, పాలక్కాడ్ 54.24, అలథుర్ 53.06, పొన్నాని 47.59, మలప్పురం 50.95, కొజికోడ్ 52.48, వాయనాడ్ 53.87, వడకర 52.30, కన్నూర్ 54.96, కాసరగోడ్ 54.10 శాతం ఓటింగ్ జరిగింది.
- Advertisement -