Monday, December 23, 2024

కేరళవాసికి జాక్ పాట్!

- Advertisement -
- Advertisement -

కేరళకు చెందిన ఓ వ్యక్తికి అదృష్టం కలసివచ్చింది. కోట్ల రూపాయల జాక్ పాట్ అతని వశమైంది. భారతీయ సేల్స్ మేన్ నలుపురక్కళ్ షంసేర్ అనే కేరళకు చెందిన యువకుడు అబూధాబిలో స్థిరపడ్డాడు. క్రిస్మస్ సందర్భంగా విక్రయించే అబూధాబి బిగ్ టికెట్ వీక్లీ లాటరీకి ఆ దేశంలో ఎంతో డిమాండ్ ఉంటుంది. తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని షంసేర్ ఓ టికెట్ కొన్నాడు. వారం తిరిగేసరికల్లా అతనికి జాక్ పాట్ తగిలింది. అతనికి మిలియన్ దిర్హామ్ లు (భారతీయ కరెన్సీలో 2,26,55,352 రూపాయలు) లభించాయి. దీంతో షంసేర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ లాటరీ గురించి సోషల్ మీడియా ద్వారా తనకు తెలిసిందనీ, ఇంత భారీ మొత్తంలో లాటరీ తగలడంతో చాలా సంతోషంగా ఉందనీ షంసేర్ అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News