Monday, January 20, 2025

ఆకలికేకలతో పిల్లి మాంసం తిన్న యువకుడు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: గత ఐదు రోజుల తిండిలేక ఆకలి కేకలతో ఓ యువకుడు పిల్లి కళేబరాన్ని పీక్కతిన్న సంఘటన కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా కుట్టిపురం బస్టాండ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అస్సాంలోని దుభరీ జిల్లాకు చెందిన యువకుడు(27) కాలేజీలో చదువుతున్నాడు. గత డిసెంబర్‌లో ఇంట్లో వారికి చెప్పకుండా రైలు ఎక్కి కేరళకు చేరుకున్నాడు. డబ్బులు లేకపోవడంతో గత ఐదు రోజుల నుంచి తిండి తినలేదు. కడుపులో పేగులు అలమటించి ఆకలి కేకలతో నీరసంగా ఉన్నాడు. పిల్లి కళేబరం కనిపించడంతో పచ్చి మంసాన్ని తింటుండగా స్థానికులు గమనించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకొని భోజనం పెట్టించారు. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News