Wednesday, January 22, 2025

దుబాయ్ మామను ముంచిన కేరళ అల్లుడు

- Advertisement -
- Advertisement -

కొచ్చి : కేరళలోని కాసరగడ్‌కు చెందిన ముహమ్మద్ హఫీజ్ దుబాయ్‌కు చెందిన ఎన్నారై వ్యాపారవేత్త అబ్దుల్ లహీర్ హస్సన్‌ను దాదాపుగా రూ 107 కోట్ల మేర మోసగించాడు. 2017లో హస్సన్ తన కూతురును హఫీజ్‌కు ఇచ్చిపెళ్లి చేశారు. బాగా నమ్మి కూతురుతో పాటు తన వ్యాపారాలను కూడా అల్లుడి చేతుల్లో పెట్టాడు. అయితే ఐదేళ్ల తరువాత ఇప్పుడు ఈ వ్యక్తి తనను బాగా దగా చేసినట్లు కనుగొని హస్సన్ న్యాయం కోసం పలుచోట్లకు పరుగులు తీస్తున్నాడు. కూతురుకు1000 గ్రాముల బంగారు నగల కట్నాన్ని కూడా అల్లుడు తన అవసరాలకు వాడుకున్నట్లు గుర్తించాడు.

దుబాయ్ మామను బాగా ప్రసన్నం చేసుకుని అల్లుడు పలు వ్యాపార సంస్థల యాజమాన్య హక్కులు కూడా పొందాడు. అయితే తనను అల్లుడు ఏకంగా రూ వందకోట్ల వరకూ మోసగించి గోవాకు పరారయినట్లు తేలడంతో దుబాయ్ వ్యాపారి కేరళ పోలీసులకు , గోవా అధికార యంత్రాంగానికి తన గోడు తెలియచేసుకున్నాడు. అయితే ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కేరళ పోలీసు క్రైంబ్రాంచ్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. కోటిన్నర విలువైన కారు తీసుకున్నాడని, పైగా ఇటీవల కంపెనీలపై ఇడి దాడుల్లో నాలుగు కోట్ల మేర ఫైన్ కట్టాల్సి వచ్చిందని అల్లుడు అడిగాడని హస్సన్ తన ఫిర్యాదులో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News