Thursday, January 23, 2025

కుటుంబంలో చిచ్చు పెట్టిన ట్రాఫిక్ కెమెరా ఫోటోలు.. జైలు పాలైన భర్త

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ‘సేఫ్ కేరళ ’ ప్రాజెక్టులో భాగంగా కేరళ రోడ్లపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాల ఫోటోలు భార్యాభర్తల మధ్య వివాదానికి దారి తీశాయి. ఏప్రిల్ 25న ఇడుక్కికి చెందిన 32 ఏళ్ల వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి స్కూటర్‌పై ప్రయాణించాడు. అయితే అతడు హెల్మెట్ ధరించక పోవడంతో ట్రాఫిక్ కెమెరాల ఫోటోల ద్వారా అధికారులు గుర్తించి ఎవరి పేరు మీద బైక్ రిజిస్టర్ అయిందో వారి మొబైల్ ఫోన్‌కు చలానా మెసేజ్ వెళ్లింది. ఆ స్కూటర్ భార్య పేరు రిజిస్టర్ అయింది. అందుకని ఆమె మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వెళ్లింది.

దీంతో ఎవరిని ఎక్కించుకుని వెళ్లావో చెప్పాలని భార్య నిలదీసింది. ఆ మహిళతో తనకెలాంటి సంబంధం లేదని కేవలం లిఫ్ట్ ఇచ్చానని చెప్పినా భార్య నమ్మలేదు. భార్యాభర్తల మధ్య కొన్నాళ్ల పాటు గొవడ నడిచింది. ఈ నేపథ్యంలో తనను, తన పిల్లలను కొడుతున్నాడని భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈనెల 5న అనేక సెక్షన్లపై భర్తను అరెస్టు చేసి జైలుకు పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News