Monday, December 23, 2024

భార్యను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టి.. ప్రియుడితో లేచిపోయిందని… 18 నెలల తరువాత భర్త అరెస్టు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ఓ వ్యక్తి తన భార్యను చంపి అనంతరం మృతదేహాన్ని తన ఇంట్లో పూడ్చి పెట్టి.. తన సతీమణి ప్రియుడితో లేచిపోయిందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 18 నెలల తరువాత భర్తను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన కేరళ రాష్ట్రం ఎర్నాకులంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సజీవ్ అనే వ్యక్తి తన భార్య రమ్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. 2021 ఆగస్టు నెలలో తన భార్య కనిపించడంలేదని భర్త జరక్కల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసి ఆమె బంధువులు నుంచి సమాచారం సేకరించిన ఆమె ఆచూకీ మాత్రం కనిపించలేదు. తన భార్య ఆమె ప్రియుడితో లేచిపోయిందని, 18 నెలలు కావొస్తుండడంతో మరో పెళ్లి చేసుకుంటానని బంధువులు, స్థానికులకు తెలిపాడు. మిస్సింగ్ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా అతడి ఇంటి ఆవరణంలో అస్థి పంజరం ఉన్నట్టు గుర్తించారు. వెంటనే సజీవ్‌ను అదుపులోకి తీసుకొని విచారించాగా తన భార్య ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడుతుండడంతో అనుమానంతో ఆమెను హత్య చేశానని ఒప్పుకున్నాడు. చంపిన తరువాత తన ఇంట్లో మృతదేహాన్ని పూడ్చిపెట్టానని నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News