Thursday, January 23, 2025

రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన కేరళ మంత్రి

- Advertisement -
- Advertisement -

 

Cheriyan

తిరువనంతపురం/పటనంథిట్ట: కేరళ మంత్రి సాజీ చెరియన్ మంగళవారం రాజ్యాంగానికి వ్యతిరేకంగా కఠినమైన వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు.  ప్రతిపక్షాలు ఆయనని తొలగించాలని డిమాండ్ చేయడంతో రాష్ట్రంలో భారీ రాజకీయ వివాదానికి దారితీసింది.  అయితే ఆ వామపక్ష నాయకుడు తరువాత విచారం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై పినరయి విజయన్ ఆయనను మంత్రివర్గం నుంచి  బహిష్కరించాలని ప్రతిపక్షం కోరగా, అధికార సీపీఎం ఆ డిమాండ్‌ను తిరస్కరించింది.

స్థానిక టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన విజువల్స్‌ ప్రకారం మంత్రి ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో దేశ రాజ్యాంగం “దోపిడీని మన్నిస్తుంది” , దేశ ప్రజలను “దోపిడీ” చేయడానికి సహాయపడే విధంగా వ్రాయబడింది’’ అన్నారు. దీనిపై విపక్షాలు ఆయనను ఎల్డిఎఫ్ క్యాబినెట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. దానికి కేరళలోని ప్రభుత్వం ఆయన నోరుజారారని, అంతమాత్రానికే రాజీనామా చేయాలని కోరడం సరికాదని సర్ది చెప్పింది. తరువాత చెరియన్ కూడా ‘‘నేనో ప్రభుత్వ సర్వెంట్ ను. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిని. రాజ్యాంగాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో నేను ఏమి చెప్పలేదు’’ అని సంజాయిషీ ఇచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News