Sunday, November 24, 2024

మహిళా స్ఫూర్తి భగీరథీఅమ్మ మృతి

- Advertisement -
- Advertisement -

Kerala oldest learner Bhageerathi Amma passed away

కొల్లాం: వృద్ధ విద్యార్థిగా ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలందుకున్న భగీరథీఅమ్మ(107) గురువారం రాత్రి మరణించారు. కేరళలోని కొల్లాం జిల్లా ప్రాక్కుళంకు చెందిన అమ్మ 105 ఏళ్లలో నాలుగో తరగితి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడం ద్వారా రికార్డు సృష్టించారు. మహిళా సాధికారతకు కృషి చేసినవారికిచ్చే నారీశక్తి పురస్కార్ అవార్డుతో అమ్మను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన భగీరథీఅమ్మ తనకన్నా చిన్నవారైన తోబుట్టువుల కోసం చదువు మానేశారు.

9 ఏళ్ల వయసులో మూడో తరగతి పూర్తి చేసి ఇంటిపట్టునే ఉండిపోయారు. 2019లో కేరళ స్టేట్ లిటరసీ మిషన్ ఆధ్వర్యంలో నాలుగో తరగతికి మూడు సబ్జెక్టుల్లో నిర్వహించిన పరీక్షల్లో 275 మార్కులకు 205 సాధించారు. అమ్మకు గణితంలో 100 శాతం మార్కులు రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. 10వ తరగతి పరీక్షలు కూడా రాయాలన్న కల తీరకుండానే అమ్మ మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రధానమంత్రి నిర్వహించే మన్‌కీబాత్ రేడియో ప్రసంగంలో భగీరథీఅమ్మను ఉదాహరణగా చెబుతూ మనలోని విద్యార్థిని ఎన్నటికీ చనిపోనీయవద్దంటూ దేశ ప్రజలకు సందేశమిచ్చారు.

Kerala oldest learner Bhageerathi Amma passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News