Wednesday, January 22, 2025

కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ డాక్టరును అరెస్టుచేసిన కేరళ పోలీస్

హైదరాబాద్: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ లో హస్తమున్న హైదరాబాద్ డాక్టరును కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఇరాన్ నుంచి కొచ్చి విమానాశ్రయానికి వచ్చిన సాబిత్ నశీర్ అనే వ్యక్తిని అరెస్టు చేశాక అతడు వెల్లడించిన అంశాల ఆధారంగా హైదరాబాద్ డాక్టరును అరెస్టు చేశారు.

ఓ వ్యక్తి కిడ్నీ తొలగించి అమ్మేశాక, ఆ వ్యక్తి మరణించడంతో అతడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు తర్వాత ఈ అరెస్టు జరిగింది. కేసు దర్యాప్తు చేసిన ఎర్నాకుళం రూరల్ ఎస్పీ వైభవ్ సక్సేనా మాట్లాడుతూ ‘‘ ఇరాన్ నుంచి రాగానే సాబిత్ నశీర్ ను కొచ్చి విమానాశ్రయంలో అరెస్టు చేశాం. కిడ్నీలు అమ్మే అండర్ గ్రౌండ్ నెట్ వర్క్ విషయాన్ని అతడు తెలిపాడు. హైదరాబాద్ లో పేరు మోసిన డాక్టరు సహా ఈ రాకెట్ లో భాగం ఉన్న మిగతా ముగ్గురి పేర్లు కూడా అతడు వెల్లడించాడు’’ అని వివరించారు.

దాంతో కేరళ పోలీసులు హైదరాబాద్ కు వచ్చి కేసు విషయమై మరింత దర్యాప్తు చేశారు. డాక్టరును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున ఆ డాక్టరు వివరాలను వెల్లడించడానికి ఎర్నాకుళం ఎస్పీ నిరాకరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News