Monday, January 20, 2025

కేరళలో ఎన్‌కౌంటర్..

- Advertisement -
- Advertisement -

వయనాడ్: కేరళలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ సందర్భంగా ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాలపూజ పోలీసు స్టేషన్ పరిధిలోని పెరియా ప్రాంతంలో కేరళ పోలీసు ప్రత్యేక బృందాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫోన్ చార్జింగ్ కోసం ఇంట్లోకి వచ్చిన మావోయిస్టులు పోలీసులకు చిక్కారు. విశ్వసనీయ సమాచారం మేరకు పలువురు మావోయిస్టులు అటవీ ప్రాంతంనుంచి ఫోన్ చార్జింగ్ కోసం ఓ ఇంట్లోకి వచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, మావోయిసులకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురు మావోయిస్టులు తప్పించుకుని పారిపోగా మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వీరిని దగ్గర్లోని పోలీసుక్యాంప్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఇటీవల కోజికోడ్‌లో అరెస్టు చేసిన మావోయిస్టు సానుభూతిపరుడు ఇచ్చిన సమాచారం మేరకు కేరళ పోలీసులు ఈ ప్రాంతంలోసెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు.ఈ సందర్భంగా స్పెషల్ ఆపరేషన్ గ్రూపు( ఎస్‌ఓజి), రాష్ట్ర పోలీసుకు చెందినథండర్ బోల్ట్ స్కాడ్, ప్రత్యేక కమాండో బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News