Friday, December 27, 2024

గూగుల్, మెటాకు కేరళ పోలీసుల నోటీస్‌లు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం నడుపుతున్న లాటరీ పేరిట ఆన్‌లైన్‌లో బోగస్ లాటరీలు అమ్ముతున్న యాప్‌లను తమ ప్లేస్టోర్ నుంచి తొలగించాలని గూగుల్‌కు కేరళ పోలీసులు ఒక నోటీస్ జారీ చేశారు. తన ఆధ్వర్యంలోని సామాజిక మాధ్యమ వేదికలు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి అటువంటి బోగస్ లాటరీల వాణిజ్య ప్రకటనలను తొలగించాలంటూ మెటాక్ అటువంటి నోటీస్ జారీ చేసినట్లు రాష్ట్ర పోలీస్ మీడియా సెంటర్ (ఎస్‌పిఎంసి) బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. 60 బోగస్ లాటరీ యాప్‌లు, 25 బోగస్ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్, 20 వెబ్‌సైట్లు ఆ కుంభకోణానికి సంబంధించినవని సైబర్ గస్తీలో వెల్లడైన తరువాత పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు ఎస్‌పిఎంసి ప్రకటన తెలిపింది.

ఈ మోసం వెనుక ఉన్నవారిపై కఠినమైన చట్టబద్ధమైన చర్య తీసుకోనున్నట్లు ఆ ప్రకటన తెలిపింది. పోలీసులు ఆ కుంభకోణం వివరాలు వెల్లడిస్తూ, ‘కేరళ మెగామిలియన్ లాటరీ’, ‘కేరళ సమ్మర్ సీజన్ ధమాకా’ పేరిట బోగస్ వాణిజ్య ప్రకటనలు వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రచారం అవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న ఆ లాటరీలను ఆన్‌లైన్‌లో కొనవచ్చని సూచిస్తున్నారని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News