కొచ్చి: కేరళ ట్రాన్స్ఉమెన్ రేడియో జాకీ అనన్య కుమారి అలెక్స్ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. కొచ్చిలోని ఎడపల్లి సమీపంలోని తనఅపార్ట్మెంట్లో శవమై కనిపించింది. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గతేడాది నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నప్పటి నుంచి ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తాను ఇంకా కోలుకోలేకపోతున్నానని, తనకు న్యాయం చేయాలని గతంలో అనన్య డిమాండ్ చేశారు. అనన్య ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. కాగా అనన్య ఈ ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి వార్తాల్లో నిలిచింది. ఆమె న్యూస్ ప్రెజెంటర్, మేకప్ ఆర్టిస్ట్ కూడా పనిచేశారు.