Saturday, February 22, 2025

కేరళలో మంకీపాక్స్ కలకలం.. రెండు కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

కేరళలో మంకీపాక్స్ కేసులు రెండు నమోదయ్యాయి. యూఏఈ నుంచి ఇటీవల వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. వయనాడ్‌కు చెందిన వ్యక్తికి తొలుత నిర్ధారణ కాగా, తాజాగా కన్నూర్ జిల్లా వాసికి వైరస్ సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు , బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఈ ఏడాది సెప్టెంబర్ లోనూ కొన్ని మంకీపాక్స్ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News