Monday, January 20, 2025

కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం.. ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం రేగింది. ఇక్కడి కొయ్‌కోడ్ జిల్లాలో ఇటీవల ఇద్దరు ఈ వైరస్ బారిన పడే ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఈ వైరస్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడానికి , పరిస్థితిని సమీక్షించడానికి కేంద్రం నుంచి నిపుణుల బృందాన్ని కేరళకు పంపినట్టు వెల్లడించారు. కొజికోడ్‌లో జ్వర సంబంధిత లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆగస్టు 30న ఒకరు, సెప్టెంబరు 11న మరొకరు మృతి చెందారు.

నిఫా వైరస్ అనుమానంతో బాధితుల నమూనాలు సేకరించి పుణె లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. తాజాగా వారు నిఫా తోనే మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. మరోవైపు వారితో అతి చేరువగా ఉన్నవారికి ఇప్పటికే చికిత్స అందిస్తున్నారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే కొయ్‌కోడ్ జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జి జిల్లాకు చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. మంగళవారం స్థానికంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలంతా మాస్క్ ధరించాలని సూచించారు.

ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. అత్యంత సన్నిహితంగా ఉన్న వారిలో ఎక్కువ మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని , అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిఫా వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. దీనిని జునోటిక్ వ్యాధి అంటారు. ఈ వైరస్ ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు , కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు, ఉన్నాయి. నిఫా వైరస్ వ్యాప్తి కారణంగా 2018, 21ల్లో కొయ్‌కోడ్ జిల్లాలో మరణాలు నమోదయ్యాయి. దక్షిణాదిలో మొదటి నిఫా వైరస్ వ్యాప్తి 2018 మే నెలలో ఈ జిల్లాలోనే వెలుగు చూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News