Monday, December 23, 2024

కేరళలో 5వ మంకీపాక్స్ కేసు నమోదు…ఇప్పటివరకు దేశంలో 7 కేసులు

- Advertisement -
- Advertisement -

 

Monkeypox

న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రంలో మంకీపాక్స్ లాంటి లక్షణాలతో ఒకరు మరణించిన కొద్ది రోజుల తర్వాత, యూఏఈ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిలో ఈరోజు పాజిటివ్‌గా తేలినందున కేరళలో మరో మంకీపాక్స్ కేసు నిర్ధారించబడింది. ఇప్పటివరకు కేరళ రాష్ట్రంలో వైరస్‌ సోకిన ఐదో కేసు ఇది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో మరో మంకీపాక్స్ కేసు వార్తలను ధృవీకరించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. 30 ఏళ్ల రోగి ప్రస్తుతం మలప్పురంలో చికిత్స పొందుతున్నాడని ఆరోగ్య మంత్రి తెలిపారు. యూఏఈ నుంచి జులై 27న కోజికోడ్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన మలప్పురంలోని మంజేరి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. కేరళ రాష్ట్రంలో ఇది ఐదో మంకీపాక్స్ కేసు. కాగా మంకీపాక్స్ లాంటి లక్షణాలతో ఒక వ్యక్తి మరణించిన తరువాత రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో ఇరవై మందిని క్వారంటైన్ చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News