Thursday, January 23, 2025

ప్రేక్షకుల స్పందన లేకనే “ కేరళ స్టోరీ ” ఆగింది…

- Advertisement -
- Advertisement -

సుప్రీంలో తమిళనాడు ప్రభుత్వం వివరణ

న్యూఢిల్లీ : వివాదాస్పద చిత్రం “ద కేరళ స్టోరీ” కి ప్రేక్షకుల స్పందన సరిగ్గా లేక పోవడంతో థియేటర్లలో ఆ సినిమా ప్రదర్శన ఆపివేశారు తప్ప ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని తమిళనాడు ప్రభుత్వం మంగళవారం సుప్రీం కోర్టుకు వివరించింది. ఈ సినిమా ప్రదర్శనను నిషేధించారనే వాదనను తమిళనాడు ప్రభుత్వం కొట్టి పారేసింది. ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధించిందని చెబుతూ ఆ చిత్ర నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

తమిళనాడు ప్రభుత్వం తమ చిత్రంపై నిషేధం విధించినట్టు ద కేరళ స్టోరీ చిత్ర నిర్మాతలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా, దానిపై సుప్రీంలో మంగళవారం విచారణ ప్రారంభమైంది. గత విచారణలో సీజేఐ నేతృత్వం లోని ధర్మాసనం పశ్చిమబెంగాల్‌తోపాటు, తమిళనాడు ప్రభుత్వానికి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయగా, ఆ నోటీసులకు తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. “ మే 7 నుంచి ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం వల్లే ఎగ్జిబిటర్లు వాళ్లంతట వాళ్లే సినిమాను ప్రదర్శించడం ఆపేశారు. సినిమాలో చెప్పుకోదగ్గ నటులు ఎవరూ లేక పోవడమో లేదా అందులో నటన బాగా లేకపోవడమో , ఏ కారణాల వల్లనో చిత్ర ప్రదర్శన ఆపేసి ఉంటారని” తమిళనాడు ప్రభుత్వం అఫిడవిట్‌లో అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

నిరసనలు వెల్లువెత్తుతాయన్న ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం తమ చిత్రంప షాడో బ్యాన్ విధించినట్టు నిర్మాతలు చేసిన ఆరోపణలను స్టాలిన్ ప్రభుత్వం కొట్టి పారేసింది. ఆ సినిమాను మొత్తం 19 మల్టీప్లెక్సుల్లో రిలీజ్ చేశామని, సినీ గ్రోయర్ల కోసం మాల్స్ వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు తమిళనాడు ప్రభుత్వం వివరించింది. ఈమేరకు మల్టీప్లెక్స్ నిర్వాహకుల నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్‌ను అఫిడవిట్‌లో ప్రభుత్వం పొందుపర్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News