Saturday, November 16, 2024

29 గంటల పాటు ర్యాగింగ్…. విద్యార్థి ఆత్మహత్యపై సిబిఐ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: సీనియర్లు వెటర్నరీ వైద్య విద్యార్థిని 29 గంటల పాటు ర్యాగింగ్ చేయడంతో అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేరళలోని వయనాడ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జెఎస్ సిద్ధార్థన్ అనే విద్యార్థి వెటర్నీరీ ఎనిమిల్ సైన్స్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సీనియర్ విద్యార్థులు సిద్ధార్థన్‌ను పలుమార్లు ర్యాగింగ్ చేశారు. ఫిబ్రవరి 16 ఉదయం 9 గంటల నుంచి సిద్ధార్థన్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేయడం ప్రారంభించారు. ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 2 గంటల వరకు ర్యాగింగ్ చేశారు. బెల్ట్‌తో అతడిని పలుమార్లు చితకబాదారు. అవమానంతో అతడు మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. మృతుడి తల్లిదండ్రులతో సిబిఐ బృందం సమావేశమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News