Sunday, December 22, 2024

మాపైన కేరళలో క్షుద్రపూజలు చేయిస్తున్నారు: డికె శివకుమార్

- Advertisement -
- Advertisement -

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి తనకు, ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యతిరేకంగా తమ రాజకీయ ప్రత్యర్థులు క్షుద్రపూజలు చేయిస్తున్నారని కర్నాటక ఉపముఖ్యమంత్రి, కెపిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ వెల్లడించారు. శత్రు భైరవి యజ్ఞ పేరిట తమకు వ్యతిరేకంగా కేరళలోని రాజ రాజేశ్వరి ఆలయం సమీపంలో క్షుద్రపూజలు చేయిస్తున్నారని ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరోపించారు. చెడు దృష్టి పడకుండా తన చేతికి పవిత్ర రక్షను కట్టుకున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు. కేరళ తాంత్రికుల చేత ఈ క్షుద్రపూజలు చేయిస్తున్నట్లు తనకు సమాచారం అందిందని, ఇందులో జంతు బలులు ఉన్నట్లు తెలిసిందని ఆయన చెప్పారు.

తమ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు తనపైన, ముఖ్యమంత్రి సిద్దరామయ్య పైన క్షుద్రపూజలు చేయిస్తున్నారని, అయితే దేవుడి అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వాన్ని రక్షిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అఘోరీలు నిర్వహిస్తున్న ఈ క్షుద్రపూజలు 21 మేకలు, మూడు దున్నలు, 21 నల్ల గొర్రెలు, ఐదు పందులను బలి ఇచ్చినట్లు శివకుమార్ ఆరోపించారు. ఈ పూజలు ఎవరు నిర్వహిస్తున్నారో వారి పేర్లను ఆయన వెల్లడించకుండా కర్నాటకలోని తమ రాజకీయ ప్రత్యర్థులు ఈ క్షుద్రపూజల వెనుక ఉన్నట్లు ఆయన ఆరోపించారు. రాజకీయాలకు చెందిన వారు కాకుండా మరెవరు చేయిస్తారని ఆయన నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News