నేగ్లేరియా ఫౌలెరి గురించి మీరు తెలుసుకోవలసింది..
మెదడు తినే అమీబా అని కూడా పిలిచే నెగ్లేరియా ఫౌలెరి, మెదడుకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలిగించే అరుదైన… కానీ ప్రమాదకరమైన సూక్ష్మజీవి.
కోజికోడ్: కేరళలో బుధవారం రాత్రి 14 ఏళ్ల యువకుడు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ ఇన్ఫెక్షన్‌తో మరణించాడు. ‘కేరళలో గత రెండు నెలల్లో మెదడును తినే అమీబా కారణంగా ఇది మూడో మరణం’ అని ఆరోగ్య అధికారులు తెలిపారు.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన యువకుడు, తీవ్రమైన తలనొప్పి,వికారం,వాంతులు వంటి లక్షణాలతో జూన్ 24న ఆసుపత్రిలో చేరాడు. ఇంటి సమీపంలోని వాగులో స్నానం చేస్తుండగా ఈ ఇన్‌ఫెక్షన్ సోకిందని భావిస్తున్నారు.
నేటి ఉదయం గూగుల్ ట్రెండ్స్ లో “కేరళ -మెదడు తినే అమీబా” అగ్రస్థానంలో ఉంది. ఈ పదానికి 10,000 కంటే ఎక్కువ సెర్చ్ లు( శోధనలు) వచ్చాయి. కేరళ యువకుడి మరణాన్ని రిపోర్టు చేసిన తర్వాత మెదడును తినే అమీబా గురించి గూగుల్‌లో సెర్చ్ ఎక్కువయింది. ఏకకణ జీవి నుండి కలిగే ఈ సంక్రమణ తరచూ ప్రాణాంతకం కాగలదు.