- Advertisement -
నీలేశ్వరం సమీపంలోని ఒక ఆలయంలో సోమవారం రాత్రి సాంప్రదాయ తెయ్యం కళారూప ప్రదర్శన జరుగుతుండగా ఆలయం వద్ద నిల్వ చేసిన బాణసంచా పేలుడు సంభవించి దాదాపు 150 మంది భక్తులు గాయపడ్డారు. ఆలయంలో తెయ్యం ప్రదర్శనను వందలాది మంది భక్తులు తిలకిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. నీలేశ్వరం సమీపంలోని వీరార్కవు ఆలయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. గాయపడిన 108 మందిని కాసర్‌గోడ్, కన్నూర్, కోజిక్కోడ్ జిల్లాలలోని ఆసుపత్రులతోపాటు పొరుగున ఉన్న కర్నాటకలోని మంగళూరులోని ఆసుపత్రులలో కూడా చేర్చి చికిత్స అందచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరికి 80 శాతం శరీరం కాలిపోయినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
- Advertisement -