Sunday, December 22, 2024

ఆక్యుపంక్చర్ వైద్యంతో ప్రసవించాలని బలవంతం… తల్లీబిడ్డలు మృతి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ఆక్యుపంక్చర్ వైద్యంతో ప్రసవించాలని ప్రయత్నం చేయడంతో సదరు తల్లీబిడ్డలు చనిపోయిన సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తిరువనంతపురంలో నయాజ్-షమీరా బివి అనే దంపతులు నివసిస్తున్నారు. షమీరా నాలుగో సారి గర్భం దాల్చింది. ఆక్యుపంక్చర్ నిపుణుడి వద్ద ఆమెకు భర్త వైద్యం చేయించేవాడు, కానీ ఆమె ఎప్పుడు వైద్యుడిని మాత్రం ముఖాముఖి సంప్రదించలేదు. తొమ్మిది నెలలో ఒక్కసారి కూడా ఆమె వైద్యుడి దగ్గర చికిత్స తీసుకోలేదు, ఆశా వర్కర్లను కూడా అతడు ఇంట్లోకి రానివ్వలేదు.

ఇరుగుపొరుగు వారితో కూడా ఆమెను మాట్లాడానిచ్చేవాడుకాదు. ఒంటరిగా ఉండాలని ఆమెను పలుమార్లు భర్త నిర్బంధించేవాడు. సాధారణ కాన్ను కోసం భార్యతో నయాజ్ పట్టుబట్టాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి నయాజ్ ఆమెకు ఆక్యుపంక్చర్ వైద్యంతో ప్రసవం చేయాలని బలవంతం చేశాడు. షమీరాకు నొప్పులు ఎక్కువగా రావడంతో ఇంట్లోనే బిడ్డను ప్రసవించాలని పట్టుబట్టాడు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లీబిడ్డలు చనిపోయారు. పోలీసులు కేను నమోదు చేసి భర్తను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News