Thursday, January 9, 2025

బస్సును ఢీకొట్టిన కారు: ఐదుగురు ఎంబిబిఎస్ విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం అలపజ్జ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కలర్‌కోడ్ ప్రాంతంలో కెఎస్‌ఆర్‌టిసి బస్సు, కారు ఢీకొనడంతో ఐదుగురు ఎంబిబిఎస్ విద్యార్తులు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సు గురువాయుర్ నుంచి కమయకులమ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు దేవనాథన్(19) (మల్లపురం) , శ్రీదేవ్ వల్సన్ (పలక్కడ్ ), ఆయుష్ షాజీ(కొట్టయామ్), మహ్మద్ ఇబ్రహీమ్(లక్షద్వీప్), అబ్దుల్ జబ్బర్(కన్నూరు)గా గుర్తించారు. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని బస్సు కండక్టర్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News