Friday, December 20, 2024

కీసరలో వైద్యం వికటించి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందాడు. యాదాద్రి జిల్లా జియాపల్లి తండాకు చెందిన దరావత్ శ్రీనివాస్ నాయక్ (35) గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు కీసరలోని లైఫ్ సేవ్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. వైద్యులు చికిత్స చేసి ఇంజక్షన్ ఇవ్వడంతో కాసేపటికి శ్రీనివాస్ నాయక్ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శ్రీనివాస్ నాయక్ మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుని బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు.

Also Read: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటి దాడులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News