Monday, December 23, 2024

రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికైన కీసర విద్యార్ధిని

- Advertisement -
- Advertisement -

కీసర అరుందతి విద్యాలయ హై స్కూల్ విద్యార్ధిని దీక్షిత రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికైంది. ఆదివారం కుత్బుల్లాపూర్‌లో జరిగిన మేడ్చల్ జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డులో అరుందతి విద్యాలయ 9వ తరగతి విద్యార్ధిని దీక్షిత ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇన్నోవేటివ్ సైకిల్ ఎగ్జిబిట్‌ను ప్రదర్శించింది.

తాను రూపొందించిన ఇన్నోవేటివ్ సైకిల్ పనితీరును వివరించి నిర్వాహకుల ప్రశంసలు అందుకొని రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ మనక్ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, పాఠశాల కరస్పాండెంట్ దశరథ, ప్రిన్సిపల్ ప్రసన్న రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికైన దీక్షతను అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News