Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్ కారణంగా నా కుటుంబం చీలిపోయింది.. కెకె షాకింగ్స్ కామెంట్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ కారణంగా నా కుటుంబం చీలిపోయిందని కేశవరావు ఆరోపించారు. కేశవరావుకు ఆయన కు టుంబ సభ్యులకు పార్టీలో పదవులు ఇచ్చినప్పటికీ బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కెకె స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని ఆయన ఎమోషనల్ అయ్యారు.

బిఆర్‌ఎస్‌లో ఉన్నన్నీ రోజులు తనకు ఓరిగింది ఏమి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా సీనియర్ అనే గుర్తింపు అయినా ఉండేదని, బిఆర్‌ఎస్‌లో సీనియర్ అనే గానీ అ సలు గుర్తింపు లేదని ఆయన షాకింగ్స్ కామెంట్స్ చేశారు. పార్టీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వనన్నారని ఆయన చెప్పారు. తన కుమారుడు విప్లవ్‌కు ఎమ్మెల్సీ అడిగితే ఇవ్వలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News